TDP leader Kaluva srinivasu: రాష్ట్రంలోని సహజ వనరులనూ వైకాపా దురాక్రమణదారులు వదలడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్‌తో పాటుగా విలువైన ఖనిజ సంపద కబ్జాకు గురవుతున్నాయని ధ్వజమెత్తారు. ఓబులాపురంలోని 25 హెక్టార్ల విస్తీర్ణంలోని మైనింగ్ ఓర్‌ను ఓ బడా కాంట్రాక్టర్‌కు దారాదత్తం చేశారని కాలువ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహజ వనరులనూ వైకాపా నాయకులు వదలడం లేదు: కాలువ శ్రీనివాసులు
Kaluva Srinivasulu: రాష్ట్రంలోని సహజ వనరులనూ వైకాపా దురాక్రమణదారులు వదలడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. ఓబులాపురంలోని 25 హెక్టార్ల విస్తీర్ణంలోని మైనింగ్ ఓర్‌ను ఓ బడా కాంట్రాక్టర్‌కు దారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గనుల్లో ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీతో తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇకనైనా వైకాపా నాయకులు ఇసుక, మట్టిని యథేచ్ఛగా దోచుకుంటున్నారన్నారు.
తెలంగాణకు చెందిన వ్యక్తికి రాష్ట్ర మైనింగ్ ఓర్ అప్పగించాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెలంగాణకు అక్రమ మైనింగ్ జరుగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ గనుల్లో ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీతో తవ్వకాలు జరుగుతున్నాయని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వం విలువైన ఇనుప ఖనిజాన్ని దోపీడీ పాలు కాకుండా కాపాడాలని కోరారు. ఓబులాపురం మైనింగ్ దోపిడీని అరికట్టాలని కాలువ డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు ఇసుక, మట్టిని యథేచ్ఛగా దోచుకోవడాన్ని నియంత్రించాలన్నారు.
ఇవీ చదవండి