pawan Kalyan on polavaram : పోలవరం ప్రాజెక్టు నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం అవుతుందో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పోలవరం గురించి సీఎం జగన్ అసలు కేంద్రంతో చర్చించారా.. అని ప్రశ్నించారు. దిల్లీ వెళ్లి పోలవరం నిధులడిగాం అంటారు.. తీరా చూస్తే బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి రూ.5,163 కోట్లు మాత్రమే వచ్చాయని.. ఇలా నిధులు విడుదల చేస్తే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు పెంచేందుకు సాంకేతిక మండలి సమ్మతించింది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.
PAWAN KALYAN: పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా?: పవన్ కల్యాణ్
pawan Kalyan on polavaram : కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దిల్లీ వెళ్లి పోలవరం నిధులడిగాం అంటారు.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.
pawan Kalyan