హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో దర్యాప్తు పూర్తయిందన్న ఈడీ.. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు మరోసారి గడువు కోరింది. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు మళ్లీ గడువు కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇందూ ప్రాజెక్ట్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు నవంబర్ 1కి, రఘురాం సిమెంట్స్ కేసులో విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
తెలంగాణ మంత్రి సబిత, నిమ్మగడ్డ డిశ్చార్జ్ పిటిషన్లపైనా విచారణను వాయిదా వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ఐఏఎస్ శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో వాదనలు కొనసాగించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ నవంబర్ 2కు వాయిదా వేసింది.