సినిమా ప్రచారంలో భాగంగా ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం విజయవాడ చేరుకుంది. ఓ హోటల్లో సమావేశమై చిత్ర యూనిట్ వివరాలను వెల్లడించింది. చిత్ర కథానాయకుడు రామ్, కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేష్.. చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ నెల 18న ఇస్మార్ట్ శంకర్ విడుదల కానుందని.. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందన్నారు. జగడం తర్వాత పూర్తి స్థాయి మాస్ సినిమా చేశానని... ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఇస్మార్ట్ శంకర్ అనే పేరుకు తగ్గట్టుగానే సినిమాలో కథానాయకుడి హావ భావాలు ఉంటాయని.. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందన్నారు.
విజయవాడలో "ఇస్మార్ట్ శంకర్" సందడి - vijayawada
విజయవాడలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది.
విజయవాడలో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్ టీమ్