ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 22, 2021, 8:23 AM IST

ETV Bharat / city

జైలు నుంచి సాంబశివరావు విడుదల

ఐఆర్​టీసీ అధికారి సాంబశివరావు మచిలీపట్నం ఉపకారాగారం నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఫైబర్​నెట్​లో అక్రమాలకు సంబంధించి ఆయనను సీఐడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు.

జైలు నుంచి సాంబశివరావు విడుదల
జైలు నుంచి సాంబశివరావు విడుదల

ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్టయి మచిలీపట్నం ఉపకారాగారంలో ఉన్న ఐఆర్‌టీఎస్‌ అధికారి సాంబశివరావు మంగళవారం విడుదలయ్యారు. ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు సంబంధించి ఆయన్ను ఇటీవల సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. సాంబశివరావు తరఫు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ విజయవాడలోని అనిశా న్యాయస్థానంలో పూచీకత్తు సమర్పించారు. అనంతరం బెయిల్‌ ఉత్తర్వులను తీసుకుని మచిలీపట్నంలోని ఉపకారాగారంలో అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details