ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yoga Day: రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Yoga Day Celebrations: రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతోపాటు న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

By

Published : Jun 21, 2022, 4:49 PM IST

Updated : Jun 21, 2022, 5:59 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా.. యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్విజయవాడరాజ్‌భవన్‌లోసిబ్బందితోకలిసి యోగాసనాలు వేశారు.హైకోర్టుప్రాంగణంలోసీజేప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతోపాటు న్యాయమూర్తులు, ఉద్యోగులు యోగా చేశారు.

విజయవాడ ఎ-కన్వెన్షన్‌లో రాష్ట్ర ఆయుష్‌శాఖ నిర్వహించిన శిబిరంలో.. ఆరోగ్యమంత్రి విడుదల రజని పాల్గొన్నారు. నిత్యం ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా.. యోగా చేయాలన్నారు. కాకినాడ రంగరాయవైద్యకళాశాల ఆడిటోరియంప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతోపాటు, కలెక్టర్‌ కృతికా శుక్లాఆసనాలు వేశారు. కోనసీమ జిల్లా మానేపల్లిలోఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యోగాసనాలు వేశారు. నెల్లూరు జిల్లా ఆత్మూకూరులోభాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోకలెక్టర్ శ్రీకేశ్​ లాఠకర్ యోగా చేశారు. యోగాతో మానసిక, శారీరక ఒత్తిళ్లు జయించి.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని

అన్నారు. అనకాపల్లి ఇండోర్‌ స్టేడియంలో ఎంపీ సత్యవతితోపాటు.. కలెక్టర్‌ పాల్గొన్నారు. విజయవాడలోని కృష్ణానది ఇసుక తిన్నెలపై ఎన్డీఆర్​ఎఫ్​ఆధ్వర్యంలోయోగా నిర్వహించారు. అమరావతి వాకర్స్‌అండ్‌ రన్నర్స్‌ అసోయేషన్‌ సభ్యులు, చిన్నారులుఆసనాలు వేశారు. గుడివాడఎన్టీఆర్​ స్టేడియంలో యోగసనాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి, కర్నూలు, నెల్లూరులోనూ అంతర్జాతీయ యోగా కార్యక్రమంనిర్వహించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన యోగా దినోత్సవంలో చిన్నారులు, మహిళలు చేసిన యోగాసనాల నృత్యం ఆకట్టుకుంది. అల్లూరి జిల్లా.. పాడేరులో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిపారు.

ఆసనాలు వేస్తున్న న్యాయమూర్తులు

ఇవీ చూడండి

Last Updated : Jun 21, 2022, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details