ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HELPING: రాష్ట్రానికి 20 రోజుల్లో రూ.17కోట్లు సాయం: అర్జా శ్రీకాంత్

రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు గత 20 రోజుల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు రూ.17 కోట్లు సాయమందించారని కొవిడ్ ప్రత్యేక అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 12 వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, 184 ఆక్సిజన్ సిలిండర్లు అందాయని వెల్లడించారు.

Help_for_Covid
Help_for_Covid

By

Published : Jun 11, 2021, 3:50 PM IST

రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు గత 20 రోజుల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు రూ.17 కోట్లు సాయమందించారని కొవిడ్ ప్రత్యేక అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. మరో రూ.18 కోట్లు సాయమందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బయోఫొర్, లుపిన్, ఇండియా బుల్స్ సంస్థలు రూ. 1.5 కోట్ల విలువైన మందులను అందించాయని అన్నారు. రెండో విడత సాయం కింద ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి నిర్మాణ్ సంస్థ 10 ఐసీయూ పడకలు చొప్పున అందిస్తోందని తెలిపారు.

మొదటి విడతగా 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్​ను ఆరు జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులలో యాక్ట్ ఫౌండేషన్ నెలకొల్పిందని అర్జా శ్రీకాంత్ వెల్లడించారు. మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మాస్టర్ కార్డ్, మాడ్యులస్ హౌసింగ్ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్టీపీసీ తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 12 వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, 184 ఆక్సిజన్ సిలిండర్లు అందాయనీ, మరో వెయ్యికి పైగా ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను పలు సంస్థలు అందించనున్నాయనీ కొవిడ్ ప్రత్యేక అధికారి అర్జా శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

Polavaram: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి డెల్టాకు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details