ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రశీదులేని 1.7 కిలోల బంగారం పట్టివేత.. నిందితుల అరెస్ట్​

By

Published : Jan 24, 2021, 7:59 PM IST

రశీదు లేకుండా తరలిస్తున్న 1.7 కిలోల బంగారు ఆభారణాలను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. బందరు లాకుల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తుండగా.. బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఐటీ అధికారులకు అప్పగించారు.

illegal gold transport caught by taskforce police in vijayawada
రశీదులేని 1.7 కిలోల బంగారం పట్టివేత

నగదు రశీదు లేకుండా బంగారు ఆభరణాలను రవాణా చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1.7 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్, మధ్యప్రదేశ్​లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ నగరానికి బంగారాన్ని తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బందరు లాకుల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తుండగా.. వీరి వద్ద బిల్లులు లేకుండా ఉన్న బంగారు ఆభరణాలను గుర్తించారు. బిల్లులు చూపకపోవటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులను ఐటీ అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details