ట్రాలీ గణనాథుల హల్చల్ - ట్రాలీ గణనాథుల హల్చల్
భాగ్యనగరంలో వినాయక నిమజ్జన వేడుకల్లో ట్రాలీ గణనాథులు ఆకట్టుకున్నాయి. చిన్న చక్రాల బండిని ఏర్పాటు చేసి దానిపై బొజ్జ గణపయ్యలను ఊరేగించారు. గణపతులతో కూడిన చిన్నచక్రాల ట్రాలీని బషీర్‌బాగ్ నుంచి హుస్సేన్‌సాగర్ తీరానికి తీసుకెళ్లారు. బేగంబజార్‌కు చెందిన మార్వాడి యువత 108 గణపతులను ట్రాలీగా ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. వీటిని చూసేందుకు భక్తులు పోటీపడుతూ సెల్ఫీలతో సందడి చేశారు.
Hull Chal of the Trolley Ganaths