ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Mission Build: ఏపీ బిల్డ్ మిషన్​పై హైకోర్టులో విచారణ

ఏపీ బిల్డ్ మిషన్ (AP Mission Build)పై హైకోర్టులో (high court) ఇవాళ విచారణ జరిగింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములు అమ్మడం సమంజసం కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం..కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..తదుపరి విచారణ జులై 15కు వాయిదా వేసింది.

High Court hearing on AP Build Mission case
ఏపీ బిల్డ్ మిషన్ కేసుపై హైకోర్టులో విచారణ

By

Published : Jun 22, 2021, 3:36 PM IST

ఏపీ బిల్డ్ మిషన్ (AP Mission Build) పేరుతో ప్రభుత్వ స్థలాలను విక్రయించటంపై హైకోర్టులో (high court) దాఖలైన పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించటం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ అంశంపై పలువురు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో..అన్ని పిటిషన్లను కలిపి జులై 15న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం జులై 15కు వాయిదా వేసింది. ఏపి బిల్డ్ మిషన్ పేరుతో జరుపనున్న స్థల విక్రయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గతంలోనే జారీ చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details