రాష్ట్రంలో కొవిడ్ మరణాలను దాచడం లేదని, వాటి వివరాలన్నింటినీ బహిర్గతం చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. పత్రికల్లో కొవిడ్ మరణాల గురించి వచ్చిన వార్తలపై మాట్లాడేందుకు ఆయన గురువారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నమూనాల పరీక్షల ఫలితాలు, మరణాల గురించి దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా పత్రికల్లో వచ్చిన వార్తలపై న్యాయపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గుంటూరు నగరంలోని బొంగరాలబీడు శ్మశానవాటికకు ఒకేసారి అన్ని మృతదేహాలను ఎందుకు పంపించారు? అవి ఏ మరణాలు?
నాకింకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే అవన్నీ కొవిడ్ మరణాలు కాదని మాత్రం చెప్పగలను. వాటిలో సాధారణ మరణాలూ ఉన్నాయి. ప్రతి మరణానికి దారితీసిన కారణాలపై జిల్లా కలెక్టర్ వివరాలు సేకరించి నివేదిక ఇస్తారు. వాటిని బహిర్గతం చేస్తాం.
అన్నీ కొవిడ్ మరణాలు కానప్పుడు భౌతికకాయాలను కుటుంబసభ్యులకు ఎందుకు అప్పగించలేదు?
ప్రభుత్వానికి మరణాల వివరాలు దాచే ఉద్దేశమే లేదని చెబుతున్నా. తక్కువ సమయం ఉన్నందువల్ల ప్రతి మరణానికి దారితీసిన కారణాలను ఇప్పటికిప్పుడు మీకు చెప్పలేకపోతున్నా.
మరణాలను దాచడం లేదు: అనిల్ సింఘాల్
రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లు మళ్లీ ఏర్పాటు చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని..,ఆస్పత్రులు, ఔషధాలు, పడకలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ కేర్ సెంటర్లు
Last Updated : Apr 23, 2021, 5:22 AM IST