రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరచిన అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు పరిచయ కార్యక్రమ సమావేశం.. కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 22 శాతం ఓట్లు జనసేనకి వచ్చాయని కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయ కర్త కేకే అన్నారు. దీనికి కారణం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవినీతిరహిత ఆలోచనా విధానమని తెలిపారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి' - కృష్ణా జిల్లా మైలవరం మారుతి కల్యాణ మండపంలో గాదె వెంకటేశ్వరరావు పరిచయ కార్యక్రమం వార్తలు
గాదె వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది జనసేన. కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ కల్యాణ మండపంలో ఆయన పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. జనసేన అభ్యర్థి గెలుపునకు అందరు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన అభ్యర్థి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జనసేన అభ్యర్థి గెలుపునకు అందరు కృషి చేయాలని నియోజకవర్గ ఇంఛార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావు విజ్ఞప్తి చేశారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన అధినేత పవన్ కల్యాణ్‌కి..అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ మూడు పార్టీలదీ ఒకే కూటమి: మంత్రి వెల్లంపల్లి
TAGGED:
hard Work for Janasena