తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాకు చెందిన రవిది ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు బిందు(8), మహేష్(6). రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్ చంపాపేటలోకి నెహ్రూనగర్‌కు చేరుకున్నారు.
పదేళ్ల వయసు వరకు అందరి మాదిరిగానే ఉన్న రవికి క్రమంగా.. కాళ్లు, చేతులు, నడుము వంకర్లు తిరిగిపోయాయి. రవిని ఇష్టపడి పెళ్లాడిన పార్వతి భర్తను చంటిబిడ్డలా చూసుకుంటోంది. ఎక్కడికి వెళ్లాలన్నా.. 36ఏళ్ల రవిని చేతులతో మోసుకేళ్లాల్సిన పరిస్థితి. పిల్లలతో పాటు భర్తను కూడా పార్వతి.. ఓ చంటిబిడ్డలా చూసుకుంటోంది. ప్రస్తుతం.. కోఠి, ఎల్బీనగర్ తదితర కూడళ్లలో భిక్షాటన చేస్తూ.. రవి బతుకీడుస్తున్నాడు.
సాయం చేయండి..