ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GRMB: అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలున్నందున వివరాలు కోరిన బోర్డు

GRMB ASKED PROJECTS DETAILS OF BOTH STATES
GRMB ASKED PROJECTS DETAILS OF BOTH STATES

By

Published : Sep 20, 2021, 10:25 PM IST

Updated : Sep 21, 2021, 7:29 AM IST

22:22 September 20

GRMB ASKED PROJECTS DETAILS OF BOTH STATES

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(GRMB) సభ్యకార్యదర్శి బి.పి.పాండే నేతృత్వంలో ఉపసంఘం భేటీ జరిగింది. హైదరాబాద్​లోని జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు భేటీకి తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు. రెండ్రోజుల సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఉపసంఘం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలను(GRMB ASKED PROJECTS DETAILS OF BOTH STATES) కోరింది. ప్రాజెక్టులు, పంప్‌హౌస్‌లు, ప్లాంట్ల వివరాలతో పాటు.. ఉద్యోగులు, సిబ్బంది వివరాలు త్వరగా ఇవ్వాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు ఉన్నందున రెండు ప్రభుత్వాలు వివరాలు అందించాలని పేర్కొంది. 

ఈ అంశాలపై ప్రధానంగా చర్చించవచ్చు..!

జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే కన్వీనర్​గా ఏర్పాటు చేసిన కమిటీలో బోర్డు సభ్యులు ఇద్దరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్రాల వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఏపీ జెన్​కో అధికారులు కూడా ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification)​లోని అంశాల అమలు కార్యాచరణ, అందుకు సంబంధించిన అంశాలపై ఉపసంఘం సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్వహణా విధానం, ఉద్యోగులు, సిబ్బంది, వనరులు, సీఐఎస్ఎఫ్ భద్రత కోసం వసతి సహా ఇతర క్లాజులపై సమావేశంలో చర్చ జరగనుంది. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో ఉపసంఘం సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల సభ్యులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది.

ఉపసంఘం ఏర్పాటు..

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ(GRMB) , కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్​తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్​గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు

ఇదీ చదవండి:  GRMB: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ

Last Updated : Sep 21, 2021, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details