విశాఖలో రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని భాజపా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జ్ సత్యమూర్తి డిమాండ్ చేశారు. ఏపీ చరిత్రలో జనవరి 20 చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. జగన్ నేలవిడిచి సాము చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గత ఐదేళ్లు అమరావతి పేరుతో సినిమా చూపిస్తే...జగన్ విశాఖలో రాజధాని అంటూ కాలయాపన చేయటానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
'జనవరి 20... ఏపీ చరిత్రలో చీకటి రోజు' - భాజాపా సత్యమూర్తి తాజా వార్తలు
ఏపీ చరిత్రలో జనవరి 20 చీకటి రోజని భాజపా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ సత్యమూర్తి వ్యాఖ్యానించారు. విశాఖలో రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
భాజపా విజయవాడ పార్లమెంటు ఇంఛార్జ్ సత్యమూర్తి