ఏపీలో మూడు రాజధానుల రగడపై కేంద్ర సర్కార్ తక్షణమే స్పందించాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని వీహెచ్ ఆరోపించారు. ఏపీలో మూడు రాజధానులపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందన్నారు. తానెక్కడా మూడు రాజధానుల మాట వినలేదని... అలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధికే నిధులు లేకపోతే...ఇప్పుడు మూడు రాజధానుల అభివృద్ధికి ఎలా వస్తాయని ప్రశ్నించారు.
'కేసీఆర్ సలహాతోనే మూడు రాజధానుల నిర్ణయం' - రాజధానిపై హనుమంతరావు కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. రాజధానుల రగడపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.