కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీలోని వాటాల విక్రయానికి ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. కేఎస్పీఎల్లోని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాటాలను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విక్రయించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేఎస్పీఎల్లోని 41.12 శాతం మేర వాటాలు అరబిందో రియాల్టి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయింపు జరుగనుంది.
ప్రభుత్వానికి - ఇంటర్నేషనల్ సీపోర్టు లిమిటెడ్‌కు గతంలో కుదిరిన ఒప్పందంలోని క్లాజ్ 2.9 మేరకు 41.12 శాతం వాటాల బదలాయింపునకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ మారీటైమ్ బోర్డు సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.