రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు. సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను.. గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గవర్నర్ కోరారు.
ఈనెల 17న కరోనా బారిన పడ్డ గవర్నర్.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.