ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హిందువులపై దాడులు ఆమోదయోగ్యం కాదు: జయదేవ్

ఆంధ్రప్రదేశ్​లో ఆలయాలు, హిందువుల మనోభావాలపై దాడులను తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో ప్రస్తావించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని..హిందువులకు న్యాయం చేయాలని కోరారు.

హిందువులపై దాడులు ఆమోదయోగ్యం కాదు
హిందువులపై దాడులు ఆమోదయోగ్యం కాదు

By

Published : Sep 21, 2020, 5:44 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రముఖ దేవాలయాల్లోని రథాలను తగలబెట్టారని చెప్పడానికి చాలా బాధపడుతున్నానని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో వ్యాఖ్యానించారు. ఆలయాలు, హిందువుల మనోభావాలపై ఈ రకమైన దాడులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

హిందువులపై దాడులు ఆమోదయోగ్యం కాదు

"ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని ఈ నెల 7న తగలబెట్టారు. నెల్లూరు జిల్లాలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి ఈ ఏడాది ఫిబ్రవరి14న నిప్పు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో... ఆరు ఆలయాల్లోని 23 దేవతామూర్తుల విగ్రహాలను ఒక్కరోజులోనే ధ్వంసం చేశారు. వీటన్నింటికి సంబంధించి ఇప్పటికి కనీసం కేసు నమోదు కాలేదు... ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. ఇంతకముందేమో...ఆస్తుల వేలం నిర్ణయం తీసుకున్న తితిదే..ఆఖరికి వెనక్కి తగ్గక తప్పలేదు. ఆలయాలు, హిందువుల మనోభావాలపై ఈ రకమైన దాడులు సరైంది కాదు" -జయదేవ్,తెదేపా ఎంపీ

ఈ ఘటనల్లో తక్షణం జోక్యం చేసుకుని హిందువులకు న్యాయం చేయాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని జయదేవ్​ కోరారు.

ఇదీచదవండి

మాచవరం పోలీసు స్టేషన్​లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details