ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నివర్' పునరావాస బాధితులకు ఆర్థికసాయం కోసం నిధులు మంజూరు

నివర్ తుపాను ధాటికి నిరాశ్రయులై పునరావాస క్యాంపుల్లో ఉన్న బాధితులకు రూ. 500 ఆర్థికసాయం చెల్లింపుల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 49,123 మందికి 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం ఆందించనుంది. వీరికోసం రూ. 2 కోట్ల 45 లక్షల 62 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది.

ap government
ఏపీ ప్రభుత్వం

By

Published : Dec 5, 2020, 8:57 PM IST

నివర్ తుపాను ధాటికి నిరాశ్రయులై పునరావాస క్యాంపుల్లో ఉన్న బాధితులకు రూ. 500 ఆర్థికసాయం చెల్లింపు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు కొత్తగా పెరిగిన బాధితులకూ ఈ సాయం వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

2020 నవంబరు 27వ తేదీతో పాటు ఆ తర్వాత నమోదైన బాధితులకూ ఆర్థిక సాయం వర్తింపజేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 49,123 మందికి 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. ప్రత్యేక ఆర్థిక సాయంగా 4 జిల్లాల్లోని బాధితులకు రూ. 2 కోట్ల 45 లక్షల 62 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. నివర్ తుపాను కారణంగా మృతి చెందిన వారి వివరాలతో పాటు దెబ్బతిన్న ఇళ్లు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పంపాలని ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details