విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఘనుడు సీఎం జగన్ అని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒక ముఖ్యమంత్రి, 26 మంది మంత్రులు ఉన్నా, సరిపోక మరో 10 మందిని సలహాదారులుగా పెట్టుకున్నా సాధించింది మాత్రం శూన్యమని దుయ్యబట్టారు. సాక్షాత్తు డిపార్ట్మెంట్ వ్యక్తులే దాదాపు రూ. 5 లక్షల విలువ గల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుపడిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.
కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జవహర్
రాష్ట్రంలో కరోనాను నివారించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఈ కరోనా కష్టకాలంలోనూ మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందని జవహర్ మండిపడ్డారు.
మాజీ మంత్రి జవహర్