విజయవాడలోని ఐస్క్రీం పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు పార్లర్లలో కాలం చెల్లిన ఐస్క్రీంలతో పాటు మరి కొన్ని తినుబండారాలు గుర్తించారు.
వాటిని ధ్వంసం చేసి పార్లర్ల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఎంజీ రోడ్లోని క్రీమ్ స్టోన్, టికెల్ రోడ్ లోని టెంప్టేషన్స్ ఐస్క్రీం పార్లర్లలో తనిఖీలు చేసినట్లు పుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు.