ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్..

రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్​లో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆంధ్ర హాస్పిటల్స్​లో పనిచేస్తున్న సిబ్బందికి మొదటగా టీకా వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

first covid vaccination in private hospitals in vijayawad
రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్

By

Published : Jan 20, 2021, 4:14 PM IST

విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్​లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ బూత్​లకు అనుమతినిచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు వెయ్యి మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి రెండు రోజుల పాటు టీకాల పంపిణీ చేయనున్నట్లు జిల్లా పాలనధికారి వెల్లడించారు. జిల్లాలో మొదటిసారి కోవాగ్జిన్ టీకాను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం ఐదు వ్యాక్సినేషన్ బూత్​లను ఏర్పాటు చేశామని.. హాస్పిటల్స్ ఛైర్మన్ డా.పి వి రామారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details