నగర శివారులో అగ్నిప్రమాదాలు... భయాందోళనలో స్థానికులు - నగర శివారులో అగ్నిప్రమాదాలు..భయాందోళనకు గురైన ప్రజలు !
విజయవాడ నగర శివారులో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఎండ తీవ్రతతోనే మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు.
నగర శివారులో అగ్నిప్రమాదాలు..భయాందోళనకు గురైన ప్రజలు !
విజయవాడ నగర శివారులోని పాయికాపురం, కండ్రక ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్ధలంలోని ఎండిన చెట్లకు నిప్పంటుకుంది. సమీప ప్రాంతంలోని అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. అదే సమయంలో పాయికాపురం నుంచి పాతపాడు వెళ్లే రహదారి వెంబడి గ్యాస్ గోడౌన్ అనుకొని ఉన్న పొలాలకు మంటలు అంటుకోవటంతో ఆ ప్రాంతవాసులు పరుగులు తీశారు. ఎండ తీవ్రతకు మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు.