ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 19, 2021, 8:39 PM IST

ETV Bharat / city

సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి ప్రకటించింది. రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితమని రైతు సంఘాల నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.

farmers leader  vadde shobanadrishwararao
farmers leader vadde shobanadrishwararao

మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి ప్రకటించింది. రైతులు చేసిన సుదీర్ఘ ఉద్యమ ఫలితమే ఈ విజయమని అభిప్రాయపడింది. రైతులు వ్యతిరేకిస్తున్నందున వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని... రైతుల మెడకు కత్తిగా ఉన్న ఈ మూడు చట్టాలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో వెనక్కి తీసుకున్నప్పుడే రైతుల పోరాటానికి ఫలితం ఉంటుందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కనీస మద్దతు ధరతో పాటు విద్యుత్ సవరణ చట్టం 2020 పై ప్రధాని ఏమీ మాట్లాడలేదని.. దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు. ముందుగా సబ్సిడీ కట్టే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి లేదని... ఏ పూట అప్పు దొరుకుతుందా? అని చూస్తున్న రాష్ట్రానికి ముందుగా చెల్లింపులు చేసే శక్తి లేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని.. ఈనెల 26న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

స్వామినాథన్ సిఫార్సుల ఊసే లేదు..

స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని.. కనీస మద్దతు ధరపై మాట మార్చారని విమర్శించారు. ప్రధాని ప్రకటన పాక్షిక విజయం మాత్రమేనని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య అన్నారు. ఇంకా విద్యుత్ బిల్లు, స్వామినాథన్ సిఫార్సుల అమలు వంటివి ఉన్నాయన్నారు. దేశంలో ఈ తరహాలో రైతుల ఉద్యమం సాగడం ఇదే ప్రథమమని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు , మహిళలు, ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాలు చేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలు మంచివే.. ఆ విషయం చెప్పడంలోనే మేము విఫలం!'

ABOUT THE AUTHOR

...view details