ఇంజినీరింగ్ చదివాడు..పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు ..డబ్బు కోసం అడ్డదార్లు తొక్కాడు. చిన్నారుల నీలి చిత్రాలను ఆన్ లైన్ లో విక్రయించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు విజయవాడకు చెందిన ఓ యువ ఇంజనీర్. విజయవాడ ఫకీర్ గూడెంకు చెందిన సోహైల్ ఇంజనీరింగ్ చదివాడు. అనంతరం పలు కంపెనీల్లో ఉద్యోగం చేసి.. జీతం సరిపోవటం లేదని మానేశాడు. ఖాళీగా ఉంటూ ఆన్ లైన్ లో నీలిచిత్రాలు చూస్తుండేవాడు. చిన్నారుల పోర్న్ వీడియోలు విక్రయిస్తాం అనే ప్రకటన చూసి వారికి ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం కొంత నగదు చెల్లించాడు. సదరు వ్యక్తి ఓ వీడియో లింక్ ను పంపాడు. ఆ లింక్ ద్వారా సుమారు 4 వేల చిన్నారుల నీలిచిత్రాలు ఉన్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో తాను కూడా ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చాడు.
ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి.. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకటన ఇచ్చిన లింక్ ను సైతం పోలీసులకు అందజేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు సోహైల్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారుల నీలిచిత్రాలు విక్రయించటం, సేకరించటం,షేర్ చేయటం, చూడటం కూడా నేరమని పోలీసులు చెపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల సీబీఐ అధికారులు పిల్లల పోర్న్ వీడియోలు విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరవకముందే నగరంలో ఇంజినీర్ ఇలా పోర్న్ విక్రేతగా మారటం కలవరం రేపుతోంది.