రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు. . గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా రీపోలింగ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేసినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారి, కేంద్ర పరిశీలకుడు, డీఎస్‌పీల పర్యవేక్షణలలో రీపోలింగ్ జరుగుతుందని ద్వివేది వివరించారు.
రీపోలింగ్ జరిగే ప్రతీ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ద్వివేది స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట రెండు చోట్లా వీడియో కవరేజ్ ఉంటుందని ఈసీ తెలిపారు.