ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గగుడి: ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్‌

విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించామని ఆలయ ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. ఈ సమావేశంలో 38 అంశాల్లో 36 అంశాలను ఆమోదించినట్టు సోమినాయుడు వివరించారు.

దుర్గగుడి: ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్
దుర్గగుడి: ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్

By

Published : Mar 24, 2021, 3:30 PM IST

విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. 2021 - 22 ట్రస్టు బోర్డు బడ్జెట్‌ సమావేశంలో 38 అంశాల్లో 36 అంశాలకు ఆమోదం లభించింది. ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించామని దుర్గ గుడి ఛైర్మన్‌ సోమినాయుడు వెల్లడించారు. ప్రతి నెలా‌ మూడో వారంలో పాలకమండలి సమావేశం జరగనుంది. విజయవాడలోని ముఖ్య కూడళ్లలో ఆలయం తరఫున ఆర్చ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు దుర్గగుడి ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు.

విజయవాడ మీదుగా వెళ్లే రైలుకు కనకదుర్గ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేస్తామన్నారు. ఒక రైలుకు కనకదుర్గ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని కోరతామని ఆలయ ఛైర్మన్‌ వెల్లడించారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా రోజుకు 5 వేలమందికి అన్నదాన వితరణ ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టెండర్లను ఆమోదించినట్టు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details