ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లి... అనంత లోకాలకు చేరి.. - ఏపీ తాజా వార్తలు

Devotee dies: ఇంద్రకీలాద్రిపై విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్​లో ఉన్న భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?

Devotee dies
ఇంద్రకీలాద్రిపై భక్తుడు మృతి

By

Published : Sep 30, 2022, 1:08 PM IST

Devotee dies: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం కోసం రూ.500 దర్శన క్యూలైన్‌లో నిల్చున్న భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిట్స్​ రావడంతో అస్వస్థతకు గురైనట్లు అక్కడున్న సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు భక్తుడిని ఆస్పత్రికి తలించేందుకు అంబులెన్సులో ఎక్కించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే దారి మధ్యలో భక్తుడు మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన మూర్తిగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details