ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వాన్ని రక్షించుకునేందుకు రాష్ట్రంలోని బీసీలంతా ఆత్మాహుతి దళాల్లా మారాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై చంద్రబాబు సహా ఆయన బృందం కుట్రలు చేస్తున్నారని వీటన్నింటినీ సమర్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. కుట్రలను తిప్పికొట్టడం ద్వారా సీఎంను రక్షించుకోవాలన్నారు. బీసీలంతా సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. విజయవాడ సమీపం గొల్లపూడిలో బీసీ సంక్షేమ భవనం ప్రారంభ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'సీఎం జగన్పై చేస్తున్న కుట్రలను సమర్ధంగా ఎదుర్కోవాలి' - Ap news
బీసీలంతా సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విజయవాడ సమీపం గొల్లపూడిలో బీసీ సంక్షేమ భవనాన్ని ప్రారంభించారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో నూతన అధ్యాయానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సహా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మోపిదేవి, పలువురు బీసీ మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు