ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతిపై భాజపా నేతల భిన్న వ్యాఖ్యలు తగవు: సీపీఐ రామకృష్ణ

By

Published : Jul 8, 2020, 6:02 PM IST

రాజధాని అమరావతిపై భాజపా నేతల భిన్న వ్యాఖ్యలు సరికావని సీపీఐ రామకృష్ణ అన్నారు. అమరావతిపై కేంద్ర, రాష్ట్ర భాజపా నాయకుల అభిప్రాయాలు వేరుగా ఉండడం దురదృష్ణకరమన్నారు.

cpi ramakrishna about sunil diyodhar comments on amaravathi
సీపీఐ రామకృష్ణ

రాజధాని అమరావతి విషయంలో భాజపా రాష్ట్ర నేతలు ఒకలా, కేంద్ర నాయకులు మరోలా మాట్లాడటం సరికాదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వ అంశమని.. దానిపై కేంద్రం జోక్యం చేసుకోదని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి సునీల్ దియోధర్ అనడం అన్యాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిపై భాజపా నేతల భిన్న వ్యాఖ్యలు తగవన్నారు.

ఆయన హోదాకు ఆ మాటలు తగవు

సభాపతి హోదాలో ఉంటూ తమ్మినేని సీతారాం న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రామకృష్ణ అన్నారు. ఆయనకు పార్టీపైన మక్కువ ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగాలని.. అంతేకాని రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అలా మాట్లాడడం తగదని హితవు పలికారు.

ఇవీ చదవండి..

'దళితులపై దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే అంబేడ్కర్ విగ్రహ స్థాపన'

ABOUT THE AUTHOR

...view details