కొత్త ఇసుక విధానంపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ అధికారులు ఈ సమీక్షకు హాజరు కానున్నారు. ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై సీఎం ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ఇసుకను సులభతరంగా పంపిణీ చేసే అంశంపై చర్చ జరగనుంది.
ఇసుక సరఫరాపై ఇవాళ కీలక నిర్ణయం..! - కడప స్టీల్ ప్లాంటుపై సీఎం జగన్ సమీక్ష వార్తలు
నూతన ఇసుక విధానంపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించనున్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై మధ్యాహ్నం చర్చించనున్నారు.
నూతన ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష
ఇసుక సరఫరా విధానానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై చేసిన అధ్యయనాన్ని ముఖ్యమంత్రికి మంత్రుల కమిటీ వివరించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఇసుక సరఫరాపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యాహ్నం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో 90 మంది అతివల బలి