ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా..? ముఖ్యమంత్రి - చంద్రబాబు
ఐదేళ్లు ఎదురు చూసినా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఆక్షేపించారు.
ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి... కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూసినా రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ఆక్షేపించారు. విశాల దృక్పథంపై మోదీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా అని ప్రశ్నించారు. సంకుచిత వ్యక్తులు విశాల దృక్పథంపై మాట్లాడటమా... అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాజపాయేతర పార్టీలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నారని కేంద్రంపై ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. మొన్న అఖిలేష్‌పై, నిన్న మాయావతిపై దాడులు చేయించారని గుర్తు చేశారు.