తెదేపా నేతలతో అధినేత చంద్రబాబుటెలీ కాన్ఫరెన్స్ చేశారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందాయని చెప్పారు. పసుపు - కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ చెక్కులు నాలుగైదు రోజుల్లోనే ఖాతాల్లో జమ అవుతాయని హామీ ఇచ్చారు. చెక్కులు చెల్లవని అసత్య ప్రచారం చేసిన వారికి ఇది చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. నేరస్థుల పార్టీని నమ్మడానికి లేదని... అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని కోరారు.
పథకాలు అడ్డుకునేందుకు వైకాపా కుట్ర.. జాగ్రత్త! - chandra babu
సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందాయని... పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ చెక్కులు నాలుగైదు రోజుల్లోనే జమ అవుతాయని హామీ ఇచ్చారు. కుట్రలు అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఐదేళ్ల తన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని... ప్రజలంతా చేతులెత్తి జైకొట్టే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని... పార్టీ కోసం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడిన వారికి రాజకీయంగా,ఆర్థికంగా గుర్తింపు ఉంటుందని... అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి....3 జిల్లాల్లో నేడు సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం