రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 376 కేసులు నమోదయ్యాయని. మొత్తం 2 వేల 288 మందిని గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. వీరిలో 80శాతం మంది వైకాపా...20 శాతం తెదేపా సానుభూతిపరులుగా లెక్కలు వెల్లడించారు. 85శాతం దరఖాస్తుదారులు దురుద్దేశపూరితంగానే ఫారం7లు పెట్టారన్నారు. చాలాకాలంగా ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల పేర్లు తొలగించాలని పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారన్నారు. ఉద్దేశపూర్వంగానే దరఖాస్తు చేశారా? సూత్రధారులెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపు కోరుతూ జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు రాగా వాటిలో సుమారు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలోనే వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఈ పారం-7 దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికంగా అర్హులైన వారి ఓట్లే తొలగించాలని దరఖాస్తులు వచ్చినట్లు సిట్ తేల్చింది. ఇప్పటి వరకు లక్షా 41 వేల 823 మంది ఓట్లు తొలగించేందుకు అర్హమైనవిగా గుర్తించారు.
జిల్లా | నమోదైన కేసులు | దరఖాస్తుదారులు | వైకాపా సానుభూతిపరులు |
శ్రీకాకుళం | 25 | 459 | 413 |
విజయనగరం | 20 | 140 | 123 |
రాజమహేంద్రవరం అర్బన్ | 6 | 58 | 45 |
కృష్ణాజిల్లా | 20 | 108 | 65 |