ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cinema Distributors: సినిమా టికెట్‌ రేట్లపై.. ప్రభుత్వంతో చర్చలకు థియేటర్‌ యజమానుల యత్నం

సినిమా టికెట్‌ రేట్లపై ప్రభుత్వంతో చర్చలకు థియేటర్‌ యజమానులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు అపాయింట్​​మెంట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానిని కోరారు.

ప్రభుత్వంతో చర్చకు థియేటర్‌ యజమానుల ప్రయత్నం
ప్రభుత్వంతో చర్చకు థియేటర్‌ యజమానుల ప్రయత్నం

By

Published : Dec 27, 2021, 3:59 PM IST

Updated : Dec 28, 2021, 6:29 AM IST

సినిమా టికెట్ల ధరల విషయమై ప్రభుత్వంతో చర్చించేందుకు థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సమస్యలు చెప్పుకునేందుకు తమకు సమయం ఇవ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కోరారు.

సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని మంత్రికి తెలపగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని.. థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలవనున్నారు. భేటీలో సినిమా థియేటర్లలో టికెట్‌ ఛార్జీలు సహా తినుబండారాల రేట్లు నియంత్రణ, తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి :

RAIDS IN CINEMA THEATERS: సినిమా హాళ్లలో తనిఖీలు.. పలు థియేటర్లు సీజ్

Last Updated : Dec 28, 2021, 6:29 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details