అమరావతి ఉద్యమంలో మహిళలు రథసారధుల్లా మారారని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా మహిళలు ఆందోళన కొనసాగిస్తున్నారని అభినందించారు. ఓ వార్తాసంస్థ సర్వే ప్రకారం 86 శాతం ప్రజలు 3 రాజధానులు వద్దన్నారని తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడానికే అమరావతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.
'సంపద విధ్వంసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది' - తెదేపా విస్తృత స్థాయి సమావేశం
సంపద సృష్టించడానికే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని... తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. సంపదను విధ్వంసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ధ్వజమెత్తారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు
సంపదను విధ్వంసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చంద్రబాబు విమర్శించారు. బోగస్ కమిటీలు వేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీ డేటా సెంటర్ విశాఖకు వస్తే లక్ష ఉద్యోగాలు వచ్చేవన్నారు. ప్రాముఖ్యత ఉన్న బిల్లులకు సమయమిచ్చి చర్చించాల్సింది పోయి... ఒకేరోజు బిల్లు పెట్టి, ఆమోదించి, వెంటనే మండలికి పంపిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు