జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తెలంగాణలోని వరంగల్... హనుమకొండ జిల్లాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాషాయ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కిషన్‌రెడ్డి రాకను పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సందడి చేశారు. నాయుడు పెట్రోల్ పంప్ నుంచి రంగశాయిపేట, పోస్ట్ ఆఫీస్ మీదుగా నగరంలోని పలు కూడళ్ల గుండా జన ఆశీర్వాద యాత్ర సాగింది.
TS News: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - central minister kishan reddy jan ashirvada yatra reached to warangal district
తెలంగాణలోని వరంగల్ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డికి భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వరంగల్‌లోని సీకేఎం ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించి టీకాల పంపిణీపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరునికి పూజలు చేశారు.
ఇదీ చదవండి:PETROL ATTACK: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు..పోలీసుల అదుపులో దుండగుడు