ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతలకు.. పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు: కేంద్రం - రాయలసీమ ఎత్తిపోతల న్యూస్

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబే లోక్​సభలో స్పష్టం చేశారు. 4 అంశాలపై వివరాలు కోరుతూ రాష్ట్రానికి 2 లేఖలు రాశామని.. అయితే రాష్ట్రం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు
రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు

By

Published : Apr 4, 2022, 4:51 PM IST

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత అనుమతుల్లో సవరణలు కోరుతూ ముఖ్యమంత్రి జగన్​ నుంచి 3 లేఖలు అందినట్లు కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 4 అంశాలపై వివరాలు కోరుతూ రాష్ట్రానికి 2 లేఖలు రాశామని.. కానీ, రాష్ట్రం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్రమంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details