కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన తాతా ప్రసాద్ మెకానిక్‌గా పనిచేసేవాడు. నకిలీ తాళాలతో కార్ల డోర్లు తెరవండలో దిట్ట.... ఎన్నాళ్లీ ఉద్యోగం అనుకున్నాడో ఏమో కొన్నాళ్ల తర్వాత మనేశాడు. చేతులు ఖాళీగా ఉండేసరికి.. దొంగతనాల బాట పట్టాడు. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడు. అలా దాదాపు10కేసుల్లోనిందితుడుగా ఉన్నాడు. ఓ కేసులో పట్టుబడి గుంటూరు సబ్‌జైలుకెళ్లాడు. అక్కడ ప్రసాద్‌కు తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన పెరియార్‌స్వామి మారిముత్తు పరిచయమయ్యాడు.... జైల్లో ఇద్దరూ కలిసి దొంగ వ్యాపారానికి పథకం వేశారు. రాష్ట్రంలో కార్లు దొంగిలించి తమిళనాడులో ట్రావెల్స్ నడపాలని నిర్ణయించారు. దానికి తాతా ప్రసాద్ నూజివీడు సబ్‌జైలులో తనకు పరిచయం ఉన్న నామాల నాగరాజు సాయం తీసుకున్నాడు. వీరంతా కలిసి పార్కింగ్ చేసిన కార్లను నకిలీ తాళాలతో మాయం చేసేవారు. విజయవాడలో ఇలా అనేక కార్లు మాయమవడంతో పోలీసులు నిఘా వేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
దొంగిలించిన వాహనాలను విజయవాడ శివారులో దాచారు. తమిళనాడు తరలించేందుకు సిద్ధంగా ఉండగా.. పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 10 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు .