ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 1, 2021, 3:38 AM IST

ETV Bharat / city

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ చెరుకువాడ శ్రీరంగనాథరాజుల తో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశంపై చర్చించింది.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ చెరుకువాడ శ్రీరంగనాథరాజుల తో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశంపై చర్చించింది. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న 67 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రులు స్పష్టం చేశారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వన్‌ టైం సెటిల్‌మెంట్ అమలుకు సిద్దం కావాలని కమిటీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

1980-2011 వరకు ఉన్న ఇళ్ళు, ఇళ్ళ స్థలాలను రుణ విముక్తి చేసుకునే అవకాశం ఓటీఎస్ ద్వారా వస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఓటీఎస్ ద్వారా ఇళ్ళపై వారికి పూర్తి హక్కు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లు చేయించు కోవడం, ఇతరులకు తమ అవసరాల కోసం విక్రయించుకునే వెసులుబాటు వస్తుందని కమిటీ సమావేశం లో చర్చించింది. ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గృహనిర్మాణం, స్టాంపులు రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలు సమన్వయంతో పనిచేసి అర్హులను గుర్తించాలని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే స్వామిత్వ పథకం కింద రాష్ట్రం మొత్తం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ వివరాలను కూడా పరిశీలించాలని మంత్రుల కమిటీ సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

Selfie Suicide: అధికారుల వేధింపులు..దివ్యాంగుడు ఆత్మహత్య !

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details