ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: భైంసాలో రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు.. పోలీసులకు గాయాలు - నిర్మల్ జిల్లా నేటి వార్తలు

తెలంగాణలోని నిర్మల్​ జిల్లా భైంసాలో వివాదం చెలరేగింది. ఓ చిన్న విషయం చిలికి చిలికి పెద్దగా మారింది. ఇరువర్గాలు మోహరించి రాళ్లు రువ్వుకున్నారు. ఇళ్లకు నిప్పుపెట్టారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైసహా పలువురికి గాయాలయ్యాయి. ఎస్పీ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

తెలంగాణ: నిర్మల్​ జిల్లాలో రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు.. పోలీసులకు గాయాలు
తెలంగాణ: నిర్మల్​ జిల్లాలో రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు.. పోలీసులకు గాయాలు

By

Published : Jan 13, 2020, 9:31 AM IST

తెలంగాణలో వివాదం.. భైంసాలో రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ద్విచక్రవాహన చోదకుడు గల్లీలో వెళ్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. అది గొడవకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడం సహా కర్రలతో దాడి చేసుకున్నారు. కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తుండగా రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహారావు, పట్టణ సీఐ వేణుగోపాలరావు, ముథోల్‌ ఎస్సై అశోక్‌, కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరితోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టేందుకు యత్నించారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

ABOUT THE AUTHOR

...view details