Modi Etela News: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. శనివారం హైదరాబాద్ వచ్చిన మోదీ.. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, చాడా సురేష్ రెడ్డి వచ్చారు.
Modi Praises Eatala : శభాష్ ఈటల.. 'చోటా ఆద్మీ బడా కామ్ కరే' అంటూ మోదీ ప్రశంసలు - pm modi hyderabad tour
Modi Etela News: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తిరిగి వెళ్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మోదీకి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్ ఈటలను ప్రధానికి పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను ప్రధానికి బండి సంజయ్ పరిచయం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో తెరాసను ఓడించారు.. అంటూ పరిచయం చేశారు. వెంటనే ఈటల భుజం తట్టిన మోదీ ఆయన్ను అభినందించారు. 'చోటా ఆద్మీ బడా కామ్ కరే' అని అన్నారని భాజపా నేత ఒకరు తెలిపారు. అనంతరం బండి సంజయ్ భుజంపై చేయి వేస్తూ.. క్యా బండీ.. ఠీక్ హై.. అంటూ పలకరించారు. (సంజయ్ బండి జీ.. ఏం సంగతి? అంతా బాగే కదా) ఇక వెళ్లి రానా అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ వెళ్లిపోయారు.
ఇదీచూడండి: