ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Atchannaidu: 'ఈ సెక్షన్ ఇంకా మనుగడలోనే ఉందని.. సీఎం జగన్ ద్వారానే తెలిసింది' - అచ్చెన్నాయుడు న్యూస్

దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందనేలా దేశ ద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు జగన్​ కు లేదనే విషయం సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందని చెప్పారు.

Atchannaidu comments on jagan over cji  remarks on sedition law
ఈ సెక్షన్ ఇంకా మనుగడలోనే ఉందని సీఎం జగన్ ద్వారానే తెలిసింది'

By

Published : Jul 15, 2021, 4:22 PM IST

వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు జగన్​కు లేదనే విషయం సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందనేలా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సీజేఐ వ్యాఖ్యలతోనైనా సీఎం కళ్లు తెరవాలని హితవు పలికారు. గతంలో బ్రిటీష్ వారు భారతీయలపై రాజద్రోహం కేసు పెట్టేవారని గుర్తు చేశారు. ఈ సెక్షన్ ఇంకా మనుగడలోనే ఉందని జగన్ ద్వారానే మళ్లీ తెలిసిందని ఎద్దేవా చేశారు.

సమస్యలకు నిలయంగా రాష్ట్రం తయారైందని అచ్చెన్న మండిపడ్డారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి భోజనం చేసినపుడు నీటి సంగతి జగన్​కి గుర్తు రాలేదా అని నిలదీశారు. నీటి సమస్యపై అవగాహన, పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ హయంలో ఏనాడూ నీటి వివాదం తలెత్తలేదన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే హైదరాబాద్​లో ఏపీ ఆస్తులను చంద్రబాబు తెలంగాణకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు తెదేపా కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:

దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details