ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున... మరిన్ని సర్వీసుల పునరుద్ధరణకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సొంత బస్సులన్నింటినీ రోడ్డెక్కించిన ఆర్టీసీ... డిసెంబర్ 1 నుంచి దశలవారీగా అద్దె బస్సులు తిప్పాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల మీదుగా దూర ప్రాంతాల మధ్య నడిచే 290 అద్దె బస్సులు తిప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు యాజమాన్యం ఆదేశాలిచ్చింది. సంస్థ నిబంధనలకు అనుగుణంగా బస్సులు తిప్పేలా అంగీకార పత్రం తీసుకోవాలని నిర్దేశించింది. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది.
డిసెంబర్ 1 నుంచి రోడ్లపైకి ఆర్టీసీ అద్దె బస్సులు - అద్దెబస్సులు తిప్పనున్న ఏపీఎస్ఆర్టీసీ తాజా వార్తలు
బస్సుల్లో తిరిగే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని సర్వీసులను పునరుద్ధరించేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సంస్థకు ఉన్న సొంత బస్సులన్నింటినీ రోడ్డెక్కించిన ఆర్టీసీ.. ఇప్పటి వరకు పక్కనపెట్టిన అద్దె బస్సులనూ దశలవారీగా రోడ్డెక్కించాలని నిర్ణయించింది.
డిసెంబర్ 1 నుంచి రోడ్డెక్కనున్న అద్దె బస్సులు!
Last Updated : Nov 19, 2020, 4:59 AM IST