రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయితీ ఉద్యోగుల, కార్మికులు చలో విజయవాడ బాట పట్టారు. గ్రామ పంచాయితీ కార్మికులకు, ఉద్యోగులకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, టెండెర్ల రద్దు, గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీలో ప్రమోషన్లు, జీవో నెంబర్లు 142, 132లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ పంచాయితీ ఉద్యోగులు,కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అర్హులైన గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని తెలిపారు.
'గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి' - gram panchayats
గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, టెండర్లు, రద్దు చేయాలని, గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీలో ప్రమోషన్లను తక్షణ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు చలో విజయవాడ బాట పట్టారు.
'గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి'