ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 757 మంది స్వస్థలాలకు తిరిగివచ్చారని.. ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ బృందం సభ్యుడు బాబు వెల్లడించారు. మరో నలుగురు విద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చేందుకు ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉండగా.. మరో విద్యార్థి పోలాండ్లోని తమ బంధువుల ఇంట్లో ఉంటానని సమాచారం ఇచ్చినట్లు తెలియజేశారు.
ఉక్రెయిన్ నుంచి స్వస్థలాలకు.. ఏపీ విద్యార్థులు - తెలుగు విద్యార్థులు తాజా వార్తలు
ఉక్రెయిన్లో చిక్కుకున్న పలువురు ఏపీ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారని ఏపీ టాస్క్ ఫోర్స్ బృందం తెలిపింది. మరో నలుగురు విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
'ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులంతా స్వస్థలాలకు చేరుకున్నారు'
మరో విద్యార్థి అక్కడే ఉంటానని తెలియచేసినట్లు బాబు వివరించారు. దీంతో.. ఏపీకి చెందిన విద్యార్ధులంతా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ టాస్క్ ఫోర్సు బృందం తెలిపింది.
ఇదీ చదవండి
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం