పంపకాల కోసం..నూతన కమిటీ నియామకం - ap
రాష్ట్ర పునర్విభజన చట్టం కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పదో షెడ్యూలులోని సంస్థల పంపకాల కోసం ఏర్పాటు చేసిన కమిటీని నూతనంగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పదో షెడ్యూల్లోని సంస్థల పంపకాల కోసం ఏర్పాటు చేసిన కమిటీని నూతనంగా నియమిస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఛైర్మన్ హోదాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కమిటీతో చర్చలు జరుపనుంది. గతంలో నియమించిన కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం.. తిరిగి కొత్త కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి, విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి సభ్యులుగా ఈ కమిటీని పునర్నియమించారు. సంస్థల పంపకాలపై తెలంగాణతో సంప్రదింపులు జరిపి.. ఓ కొలిక్కి తెచ్చేందుకు ఈ కమిటీ ప్రయత్నించనుంది.