ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 15, 2020, 6:05 AM IST

ETV Bharat / city

సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్​.. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఏపీ ఎంసెట్‌ను సెప్టెంబరు 17 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వాటిని వారం రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ను 9 సెషన్స్‌లో నిర్వహిస్తారు. వచ్చే నెల 10న ఐసెట్‌తో ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు అక్టోబరు 5న పీఈసెట్‌తో ముగుస్తాయి.

ap eamcet exams conduct from september 17th to 25th
ap eamcet exams conduct from september 17th to 25th


ఐసొలేషన్‌ కేంద్రాలకు పీపీఈ కిట్లు
కరోనా లక్షణాలున్న వారి కోసం ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి 5శాతం ఉంటాయి. ఇక్కడ విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందించనున్నారు. ఇటీవల కర్ణాటకలో కేసెట్‌ నిర్వహణకు అవలంబించిన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆవరణలోకి ప్రవేశించే వారికి థర్మల్‌ స్కానింగ్‌ చేస్తారు. ప్రతీ రోజు శానిటైజ్‌ చేస్తారు. ఇన్విజిలేటర్లకు మాస్కులు, గ్లౌజ్‌లు అందిస్తారు. మరుగుదొడ్లు, పరీక్ష కేంద్రాల వద్ద సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.
కరోనా పాజిటివ్‌ వారికి ఏదో ఒక రోజు
కరోనా పాజిటివ్‌ విద్యార్థులకు ఎంసెట్‌ నిర్వహించే వారం రోజుల్లో ఏదో ఒక రోజు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. కరోనా బారిన పడిన, రెడ్‌జోన్‌లో ఉన్న వారికి రవాణా సదుపాయం కల్పించేందుకు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details