ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో మరో కొత్త అధ్యాయం: జస్టిస్ ఎన్వీ రమణ - హైకోర్టు

తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ

తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Feb 3, 2019, 3:41 PM IST

తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగు ప్రజలకు, హైకోర్టు భవనానికి భూములు ఇచ్చిన ప్రజలకు జస్టిస్‌ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమి సేకరించి భవనం నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. అమరావతి కొత్త రాజధాని కాదని... శాతవాహనుల కాలంలోనే ధాన్యకటకం పేరుతో ఆంధ్రులుగా రాజధానిగా ఉందని తెలిపారు. 179 రోజుల్లోనే కొత్త భవనాన్ని నిర్మించి హైకోర్టు ఏర్పాటు చేశారని..భవన నిర్మాణంలో కృషి చేసిన వారిని జస్టిస్ అభినందించారు. న్యాయవ్యవస్థ అంటే న్యాయమూర్తుులు, న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్ మాత్రమే కాదన్నారు. ప్రజలకు న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. రేపటి నుంచే ప్రారంభమయ్యే కొత్త హైకోర్టు కార్యకలాపాలతో.. 2వేల ఏళ్ల చరిత్ర ఉన్న అమరావతిలో మరో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఈదేశంలో న్యాయవ్యవస్థ ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుందని న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను భూతద్దంలో పెట్టి చూపేందుకు కొందరు యత్నిస్తున్నారు జస్టిస్ రమణ ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details